పెన్నానది ఐలాండ్‌లో 12 మంది అరెస్ట్
NLR: ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం సమీపంలోని పెన్నా నది ఐలాండ్‌లో పేకాట ఆడుతున్న 12 మందిని పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. SP అజిత పర్యవేక్షణలో రూరల్ DSP ఘట్టమనేని శ్రీనివాస్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దాడులు చేపట్టారు. డ్రోన్ కెమెరాతో పేకాట రాయుళ్ల కదలికలను పసిగట్టి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 3 లక్షల నగదు, 3 కార్లు, 6 బైకులు సీజ్ చేసినట్లు తెలిపారు.