మైక్రో ఫైనాన్స్ సంస్థ దురుసు ప్రవర్తన.. మహిళ ఆత్మహత్యాయత్నం

మైక్రో ఫైనాన్స్ సంస్థ దురుసు ప్రవర్తన.. మహిళ ఆత్మహత్యాయత్నం

WGL: అవమానంతో మహిళ ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన పర్వతగిరి మండలంలోని చింతనెక్కొండలో చోటుచేసుకుంది. జయమ్మ అనే మహిళ ఓ మైక్రో ఫైనాన్స్ సంస్థలో ప్రతి శుక్రవారం వాయిదా చెల్లించాల్సి ఉండగా, డబ్బులు లేక వచ్చేవారం చెల్లిస్తానని చెప్పింది. దీంతో వసూలు సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో అవమానంతో మహిళ గడ్డిమందు తాగింది. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.