వివాహిత అదృశ్యంపై కేసు నమోదు

వివాహిత అదృశ్యంపై కేసు నమోదు

ELR: తెడ్లం గ్రామానికి చెందిన ఓ వివాహిత కనిపించకుండా పోయినట్లు ఎస్సై ఎం. జయబాబు ఆదివారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. తెడ్లంకు చెందిన కంకిపాటి వెంకన్నబాబు ఏడాది క్రితం ఒడిశాకు చెందిన జ్యోత్స్న బెనియను వివాహం చేసుకున్నాడు. అయితే, ఫిబ్రవరి 27 నుంచి ఆమె ఆకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.