కొత్త తేజ మిర్చి.. నేటి ధర

WGL: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో కొత్త తేజ మిర్చి ధర తరలివస్తుండగా ధరలు మాత్రం క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గతవారం గరిష్ఠంగా రూ. 16 వేలు పలికిన కొత్త తేజా మిర్చి ధర సోమవారం రూ.15,516 ధర పలికింది. ఈరోజు మళ్ళీ తగ్గి రూ. 15, 500 అయిందని అధికారులు తెలిపారు. ధరలు తగ్గుతుండడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు.