భక్తి శ్రద్దలతో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

భక్తి శ్రద్దలతో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

SKLM: సంతబొమ్మాళి మండలం కారిపేట గ్రామంలో ఉన్న శ్రీకృష్ణాలయం వద్ద శనివారం భక్తి శ్రద్ధలుతో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. పాండవులు మెట్టకు చెందిన నిరంజన గిరిబాబా ఆధ్వర్యంలో ఉదయం నుంచి యజ్ఞం, హోమం, భగవద్గీత సామూహిక పారాయణం జరిపారు. ఆలయం ధర్మకర్త శ్రీమాన్ కొమర అప్పయ్య ప్రత్యేక పూజలు చేశారు. పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.