ఆక్రమణలు తొలగించిన వన్‌టౌన్ పోలీసులు

NTR: విజయవాడలోని సామారంగం చౌకీ, 30 అడుగుల రోడ్డుకు ఇరువైపులా పెరిగిపోయిన ఆక్రమణలను వన్ టౌన్ పోలీసులు తొలగించారు. రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని హెచ్చరించి, దుకాణాల సామాగ్రిని పూర్తిగా తొలగించారు. ఈ చర్యలతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య కొంతమేర తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.