కార్యకర్తలంతా కలసికట్టుగా పనిచేయాలి: ఎమ్మెల్యే
PPM: బలిజిపేట మండల కేంద్రంలోని కళింగ వైశ్య కళ్యాణ మండపంలో శుక్రవారం టీడీపీ నేతలు, కార్యకర్తలతో పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర ప్రత్యేకంగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను ప్రారంభించాలని, కార్యకర్తలు వారికున్న సమస్యలను అక్కడి పెద్దలకు ముందుగా తెలియజేయాలన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.