దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులు అరెస్ట్
MDCL: బాచుపల్లి, నార్సింగి పరిధిలో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న నెమలి డేవిడ్ రాజ్, ఆరె సాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 30 గ్రాముల బంగారం, వెండిపట్టీలు, ఒక డియో స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించగా, చాకచక్యంగా వ్యవహరించిన క్రైమ్ టీమ్‌ను ఉన్నతాధికారులు అభినందించారు.