ప్రముఖ రచయిత్రి కన్నుమూత
HYD: వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు సతీమణి, ప్రముఖ రచయిత్రి తెన్నేటి సుధాదేవి రామ రాజు (73) ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని నల్లకుంటలో ఉన్న ఆమె స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. తెలుగు సాహిత్యం, సాంస్కృతిక రంగాల్లో ఆమె చేసిన సేవలు చిరస్మరణీయం. ఈమె మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు.