గంజాయి సాగు చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదు

గంజాయి సాగు చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదు

ADB: తలమడుగు మండలం పెండలవాడ గ్రామంలో నలుగురి ఇంట్లో పెంచుతున్న 4 కిలోల 460 గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు ఇన్‌ఛార్జ్ ఎస్సై జీవన్ రెడ్డి తెలిపారు. పెరట్లో గంజాయి మొక్కలు సాగు చేస్తున్న ఆత్రం సోనే రావ్, టేకం మల్కు, మడావి సోనీ బాయి, ఆత్రం అయ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నలుగురు పరారీలో ఉన్నారని పట్టుకొని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.