నేడు మంత్రి పొంగులేటి రాక

MBNR: భూభారతి చట్టంపై చిన్నచింతకుంట,కౌకుంట్ల మండలాల అవగాహన సదస్సు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం అమ్మపూర్‌లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరు కానున్నట్లు పార్టీశ్రేణులు తెలిపారు. ఉదయం 11గంటలకు జరిగే అవగాహన సదస్సుకు హాజరుకావాలని పేర్కొన్నారు.