సానిపల్లిలో ఎంపీ వీరాభిమాని మృతి
సత్యసాయి: రొద్దం మండలం సానిపల్లి గ్రామానికి చెందిన ఎంపీ బీకే. పార్థసారథి వీరాభిమాని కురుబ శ్రీనివాసులు ఆత్మహత్య చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం గురువారం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ అల్లుడు శశి భూషణ్ పటేల్ ఆసుపత్రి వద్దకు వెళ్లి మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.