కూడేరు వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి

ATP: కూడేరు మండలం సమీపంలోని 42వ జాతీయ రహదారి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన వ్యక్తిని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి శరీరంపై గాయాలు ఉండడంతో ఏదైనా వాహనం ఢీకొని ఉంటుందేమో అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.