బొప్పాపూర్ - రుద్రూర్ గ్రామాల మధ్య రాకపోకలు బంద్

బొప్పాపూర్ - రుద్రూర్ గ్రామాల మధ్య రాకపోకలు బంద్

NZB: రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్-రుద్రూర్ గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి వాగు ఉద్ధృతంగా ప్రవహించి, లోలెవల్ వంతెనను ముంచెత్తింది. దీంతో పోలీసులు ట్రాఫిక్ బోర్డులు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. వాగు ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకొని, ఇరు గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాల న్నారు.