'అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్లపై చర్యలు తీసుకోవాలి'

'అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్లపై చర్యలు తీసుకోవాలి'

KRNL: ఆదోనిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తూ ప్రజలను మభ్యపెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఇవాళ సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. రంగురంగుల కాగితాలు, రాళ్లతో ప్రజలను ఆకర్షిస్తూ అక్రమంగా వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. సీపీఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న ఆధ్వర్యంలో నాయకులు మున్సిపల్ కమిషనర్ నయీమ్‌కు వినతి పత్రం అందజేశారు.