VIDEO: ఆశా వర్కర్ల పై అధికారుల వేధింపులు

NZB: జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గురువారం పీహెచ్సీ ఆశా వర్కర్లు నిరసన తెలిపారు. సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే అధికారులు వేధిస్తున్నారని, డ్యూటీలో ఉండాలని చెప్పడం సరికాదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. ఆశా వర్కర్‌తో డిప్యూటీ డీఎంహెచ్ అంజన దురుసుగా ప్రవర్తించారని, గాజులు, లిప్‌స్టిక్ పెట్టుకోవద్దని, రూల్స్ తెలియవా అని బెదిరించారన్నారు.