VIDEO: కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా
KMR: మొక్కజొన్న, జొన్న పంటల కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తాడ్వాయిలో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా కేంద్రాలు ప్రారంభించినా జిల్లాలో ఏర్పాటు చేయకపోవడం దారుణమని వారు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని కోరారు.