గాజరలో నిరసన తెలిపిన ఉపాధ్యాయులు

గాజరలో నిరసన తెలిపిన ఉపాధ్యాయులు

NGKL: వంగూరు మండలం గాజర జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం తమకు న్యాయంగా ఇవ్వాల్సిన డీఏలు, పీఆర్సీ సంవత్సరాలు గడుస్తున్న ఇవ్వడంలేదని తమకు వెంటనే పీఆర్సీ ఇవ్వాలని, పెండింగ్ డీఎలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.