ఆగస్టు 1 నుంచి అదనపు విమాన సేవలు

ఆగస్టు 1 నుంచి అదనపు విమాన సేవలు

VSP: నగర వాసులకు మరో శుభవార్త. ఆగస్టు 1 నుంచి రెండు కొత్త ఎయిరిండియా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. విశాఖ-పోర్ట్ బ్లెయిర్-విశాఖ, విశాఖ - ముంబై మధ్య ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఎయిరిండియా షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ కొత్త సర్వీసులతో విశాఖ నుంచి ప్రయాణించే వారికి మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది.