చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య

చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య

KMR: మానసిక స్థితి సరిగ్గా లేక ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పిట్లంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గొల్ల శ్రీనివాస్(37) గత కొంతకాలంగా మతిస్థిమితం సరిగ్గా లేదు. ఈ క్రమంలో గ్రామ శివారులోని పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు జాలర్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.