41 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు

41 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు

వరంగల్ నగరంలో సోమవారం రాత్రి నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 41 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 36 మందిని, లైసెన్స్ లేకుండా నడిపిన మరో 5 మందిని పోలీసులు పట్టుకున్నారు. నిందితులకు కోర్టు జరిమానా విధించింది. కాగా నిబంధనలు పాటించని వారి వాహనాలు సీజ్ చేస్తామని పోలీసులు తెలిపారు.