VIDEO: 'బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేస్తే చర్యలు తప్పవు'
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలలో ధూమపానం చేస్తే చర్యలు తప్పవని కమిషనర్ నందన్ హెచ్చరించారు. పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న తృప్తి కాంటీన్‌ను కమిషనర్ ఇవాళ సందర్శించారు. ఓ టీ స్టాల్ వద్ద బహిరంగంగా ధూమపానం చేస్తున్న వ్యక్తులను గుర్తించి దుకాణం నిర్వాహకులను హెచ్చరించారు.