బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్
MBNR: రాష్ట్రంలో అధిక జనాభా ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుందని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు తాయప్ప అన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయం వద్ద గోడపత్రికలు ఆవిష్కరించి మాట్లాడారు. నోటిఫికేషన్లు వచ్చినా బీసీ యువతకు ఉద్యోగాలు దక్కడం లేదన్నారు. ముదిరాజులను బీసీ డీ నుంచి బీసీ ఏలో చేర్చాలని డిమాండ్ చేశారు.