పుచ్చకాయ ఫేస్‌ప్యాక్ ట్రై చేశారా?

వేసవిలో విరివిగా దొరికే పుచ్చకాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరాన్ని హైడ్రేటెట్‌గా ఉంచటంలో సహకరించే ఇవి.. చర్మానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయ రసంతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే ముఖం సహజమెరుపును సంతరించుకుంటుంది. చర్మం పొడిబారే సమస్య తగ్గుతుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు, ముడతలు తొలగిపోతాయి. ఈ రసంలో పాలు కలిపి రాసుకుంటే మెరుగైన ఫలితం ఉంటుంది.