వింత ఘటన.. గుడ్డు పెట్టిన కోడిపుంజు
SKLM: జిల్లాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. సహజంగా కోడిపెట్ట గుడ్డు పెడుతుంది, కానీ ఎల్‌ఎన్‌పేట మండలం బొర్రంపేటలోని సతీష్ అనే వ్యక్తి ఇంట్లో ఒక కోడిపుంజు గుడ్డు పెట్టింది. దీంతో సతీష్, అతని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. కాగా జన్యుపరమైన లోపాల వల్ల ఇలా జరుగుతాయని పశుసంవర్ధక శాఖ అధికారులు అంటున్నారు.