ఉచిత వేసవి శిక్షణ శిబిరం ప్రారంభించిన ఎంఈవో

ADB: కన్నెపల్లి మండలం జనకాపూర్ గ్రామపంచాయతీలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉచిత వేసవి శిక్షణ శిబిరంను శుక్రవారం MEO రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, చిన్నారుల కోసం ఏర్పాటుచేసిన ఉచిత సమ్మర్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.