మంచిర్యాలలో ఆరుగురు ఆకతాయిల అరెస్ట్

మంచిర్యాలలో ఆరుగురు ఆకతాయిల అరెస్ట్

MNCL: మంచిర్యాలలోని రాముని చెరువు పార్క్ వద్ద వెకిలిచేష్టలు చేస్తూ మహిళలను ఇబ్బంది పెట్టిన ఆరుగురు ఆకతాయిలను షీటీం సిబ్బంది పట్టుకున్నారు. ఆకతాయిలు వెకిలి చేష్టలు చేస్తున్నట్లుగా సమాచారం రావడంతో సిబ్బందితో వెళ్లి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి రెడ్ హ్యాండెడ్‌గా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.