నేడు భారీ జాబ్ మేళా
KRNL: జిల్లా కేంద్రంలో నందనం డిగ్రీ కాలేజీ ఆధ్వర్యంలో ఈ నెల 14న ఉదయం 10 గంటలకు అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ HGH ఆర్కేడ్‌లో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కాలేజీ కరెస్పాండెంట్ జనార్ధన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ కంపెనీల్లో సుమారు 250 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వివరించారు. SSC, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు.