ఉచిత బస్సు ప్రయాణం పథకానికి ఏర్పాట్లు

NLR: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి ఎస్.కె. షమీమ్ తెలిపారు. బుధవారం ఆమె కావలి డిపోను సందర్శించి, అధికారులతో సమావేశమయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో డిపోలోని అన్ని విభాగాల సిబ్బంది,యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.