19న జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక
నల్గొండ జిల్లా పురుషుల, మహిళల కబడ్డీ జట్ల ఎంపికను ఈ నెల 19న నిడమనూరులో జరగనున్నాయి. ఈ మేరకు ఆదివారం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శలు ఆర్. భూలోకరావు, జి. కర్తయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పురుషుల విభాగంలో 85 కేజీల లోపు, మహిళల విభాగంలో 75 కేజీల లోపు ఉండాలని పేర్కొన్నారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు తమ ఆధార్ కార్డుతో రావాలని సూచించారు.