VIDEO: ఆకట్టుకున్న భజన కార్యక్రమం
MDK: పెద్ద శంకరంపేట శ్రీ సీతారామచంద్రస్వామి పునః ప్రతిష్ట ప్రథమ వార్షికోత్సవ ఉత్సవాలలో భాగంగా శనివారం అర్ధరాత్రి వరకు నిర్వహించిన భజన కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వార్షికోత్సవ ఉత్సవాలలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి సమయంలో భజనలు చేస్తూ కీర్తనలు, ప్రత్యేకంగా శ్రీ సీతారామచంద్రస్వామి పాటలు పాడారు.