'పులివెందుల రైతాంగాన్ని ఆదుకోవాలి'

KDP: పులివెందుల రైతాంగాన్ని ఆదుకోవాలని తుంగభద్ర ప్రాజెక్ట్ హై లెవెల్ కెనాల్ ఛైర్మన్ జోగిరెడ్డి కోరారు.ఆదివారం కడప పర్యటనకు వచ్చిన రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని ఆయన కలసి విజ్ఞప్తి చేశారు. పులివెందుల ఇరిగేషన్ సమస్యలు పరిష్కరించాలని, చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇచ్చి పులివెందుల రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.