మూడేళ్ల ప్రేమ.. పోలీసు స్టేషన్‌కు చేరిన పంచాయితీ!

మూడేళ్ల ప్రేమ.. పోలీసు స్టేషన్‌కు చేరిన పంచాయితీ!

KKD: ప్రేమించి పెళ్లికి నిరాకరించిన ఓ యువకుడిపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సూర్యనారాయణపురానికి చెందిన 24 ఏళ్ల యువతి, కొవ్వూరుకు చెందిన యువకుడు మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే, పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా.. సదరు యువకుడు తప్పించుకు తిరగడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు సీఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.