VIDEO: 'గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు అంధకారం'
NZB: గంజాయి మత్తుకు బానిసై యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని శనివారం మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమర్ ఆందోళన వ్యక్తం చేశారు. బోధన్లో ఆయన మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు యువతను శారీరక-మానసికంగా బలహీనపరచి నేరప్రవృత్తికి దారి తీస్తున్నాయన్నారు. గంజాయి విక్రయాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.