అల్లినగరం ఎంపీపీ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

ప్రకాశం: కొమరోలు మండలంలోని అల్లినగరం ఎంపీపీ పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు శనివారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహిస్తున్న రికార్డులను ఎంఈవో తనిఖీ చేసి అనంతరం విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఎంఈవో విద్యార్థులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను చక్కగా వినియోగించుకోవాలన్నారు.