పాయకరావుపేటలో పేరంటాలమ్మ జాతర
AKP: పాయకరావుపేట మంగవరం రోడ్డులో సీతారాముల ఆలయం సమీపంలోని పేరంటాలమ్మ తల్లి జాతరను గురువారం నిర్వహిస్తున్నారు. ఉగాది రోజున ప్రతి ఏడాది ఈ జాతర నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని ఆలయ కమిటీ తెలిపింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సాయంత్రం పరస (చిలకల తీర్థం) కార్యక్రమం నిర్వహించనున్నారు.