15న ఒంగోలులో సీఐటీయూ 15వ రాష్ట్ర సభలు

15న ఒంగోలులో సీఐటీయూ 15వ రాష్ట్ర సభలు

ప్రకాశం: ఈ నెల 15, 16 తేదీల్లో సీఐటీయూ 15వ రాష్ట్ర సభలు ఒంగోలు నగరంలో నిర్వహించనున్నట్లు యూనియన్‌ గౌరవాధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడిన 40 ఏళ్ల తర్వాత తొలిసారిగా రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై పోరాటాలు చేయడంలో ముందున్నామన్నారు.