అక్రమ నిర్మాణాలపై GHMC కూల్చివేతలు
RR: రాజేంద్రనగర్ పరిధిలోని 'బుద్వేల్ టీచర్స్' కాలనీలో అక్రమ నిర్మాణాలపై GHMC అధికారులు ఇవాళ చర్యలు చేపట్టారు. ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన అదనపు అంతస్తులను అధికారులు కూల్చివేశారు. కాలనీ వాసులకు ముందుగా నోటీసులు ఇచ్చినా మార్పులు లేకపోవడంతో చర్యలు తీసుకున్నారు. దీంతో పట్టణ ప్రణాళిక, ప్రజల భద్రత కోసం ఇలాంటి చర్యలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.