పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చూడాలి: MHO

GNTR: తెనాలిలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరచాలని మున్సిపల్ ఆరోగ్య శాఖాధికారి ఏసుబాబు సూచించారు.బుధవారం పట్టణంలోని శివారు కాలనీలలో పర్యటించిన ఆయన పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. వర్షాలు కురుస్తున్నందున రోడ్లపై వ్యర్థాలు లేకుండా చూడాలని, మురుగు కాలువలలో నీరు సక్రమంగా పారేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.