చందానగర్‌లో దుండగుల కాల్పుల వీడియో

RR: చందానగర్‌లోని ఖజానా జ్యువెలర్స్‌లో దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. జ్యువెలరీ షోరూమ్ ఓపెన్ చేయగానే మాస్కులు ధరించి దుండగులు వచ్చారు. విడివిడిగా వచ్చిన దుండగులు షాప్‌లోకి రావడంతోనే గన్ తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఒకరి వెంట ఒకరు వచ్చిన దుండగులు బెదిరింపులకు పాల్పడ్డ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.