'మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి'

SDPT: విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తుకు చక్కటి బాటలు వేసుకోవాలని ఎస్సై బోయిని సౌజన్య సూచించారు. బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో మాదకద్రవ్య నిరోధక అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎస్సై సౌజన్య ముఖ్య అతిథిగా హాజరై, యువత మాదకద్రవ్యాల వలలో పడటం వల్ల ఎదుర్కొనే శారీరక, మానసిక సమస్యల గురించి వివారించారు.