రేపు అయ్యప్ప స్వామి ఆలయంలో గీతా పారాయణం

SRD: పటాన్‌చెరు శాంతినగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 'సంపూర్ణ గీతా పారాయణం' బ్రాహ్మణ సేవా సంఘం, దేవాలయ అధ్యక్షులు నర్రా బిక్షపతి పటేల్, గౌరవ అధ్యక్షులు రమా సంజీవరెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 'గీతా పారాయణ' అవార్డు గ్రహీత గిరిధర్ రావు దేశ్ పాండే గీతా పారాయణం చేయనున్నట్లు వెల్లడించారు.