'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో ఎమ్మెల్యే
E.G: గోకవరం మండలంలోని అచ్చుతాపురంలో గురువారం ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట MLA నెహ్రూ ముఖ్యఅతిథిగా హాజరై 943 మంది లబ్ధిదారులకు నూతన పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నా హక్కులు లేని భూములకు, కూటమి ప్రభుత్వం పట్టాలిచ్చి భరోసా కల్పించిందన్నారు.