10 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఒడిశాలోని కంధమాల్(D)లో మావోయిస్టులకు భారీ దెబ్బ తగిలింది. రూ.1.65 కోట్ల రివార్డు ఉన్న 10 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. హింసా మార్గాన్ని వీడి, జనజీవన స్రవంతిలో కలవాలని వారు నిర్ణయించుకున్నారు. పోలీసుల సమక్షంలో ఆయుధాలు విడిచిన వీరికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం కల్పించనున్నారు. ఇది ఆ ప్రాంతంలో మావోయిస్టు నెట్‌వర్క్‌కు పెద్ద తలపోటుగా మారింది.