'విద్యార్థుల భోజనంలో నియమాలు పాటించాలి'
BHNG: భువనగిరి హనుమాన్ వాడలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి భోజన సౌకర్యాలపై ఆరా తీశారు. మెనూ ప్రకారం రుచికరమైన ఆహారం అందించాలని, నాణ్యతలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. తరగతి గదులు, వంటశాలలను పరిశీలించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు.