'పేదలకు సెంటు స్థలం... జగన్‌కు మాత్రం ప్యాలస్'
PPM: గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల కోసం సెంటు స్థలం మాత్రమే ఇచ్చారని అది ఎటు చాలక లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారని... జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్యాలస్‌ల మీద ప్యాలెస్ కట్టుకున్నారని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. బుధవారం పార్వతీపురం పట్టణంలోని జగన్నాథపురంలో గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కలెక్టర్ ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.