దుర్వాసనతో తండావాసుల ఆందోళన
WGL: పర్వతగిరి మండలానికి చెందిన కోళ్ల ఫామ్ యజమాని రాములు వైరస్‌తో మృతి చెందిన వేలాది కోళ్లను ఎస్సారెస్పీ పెద్ద కెనాల్ కాలువలో పడేశాడు. దీంతో కాలువ నీరు కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో తండావాసులు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ కిషన్ నాయక్ పర్వతగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చనిపోయిన కోళ్లను వెంటనే తొలగించాలని తండావాసులు కోరుతున్నారు.