డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం : అశోక్ రెడ్డి

NLG: డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని NLG ఆర్టీవో యారాల అశోక్ రెడ్డి అన్నారు. కట్టంగూర్, నార్కట్‌పల్లి మండలాలకు చెందిన 20 మంది దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆర్థికసాయం ప్రకటించింది. శుక్రవారం కట్టంగూర్ MPDO కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అట్టి ఆర్థిక సాయాన్ని దివ్యాంగులకు అందజేశారు.