చివరి దశ పనుల్లో వేగం పెంచాలి: మంత్రి
MLG: మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల పునర్నిర్మాణ అభివృద్ధి చివరి దశ పనుల్లో వేగం పెంచి, ఆలయ ప్రాంగణాన్ని భక్తులకు మహాద్భుతంగా తీర్చిదిద్దాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంబంధిత అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. మేడారం హరిత హోటల్‌లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు.