విశాఖ రేంజ్ డీఐజీని కలిసిన ప్రొబేషనరీ ఎస్సైలు

VSP: విశాఖ రేంజ్ డీఐజీ కార్యాలయంలో శిక్షణ పూర్తిచేసుకున్న ప్రొబేషనరీ సివిల్ ఎస్సైలు డీఐజీ గోపినాథ్ జట్టిని బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. వారికి ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ, విధినిర్వహణలో నిర్వహించవలసిన సూచనలు చేశారు. శిక్షణలో అభ్యసించిన అంశాలపై వారిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, ఏఎస్సార్ జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.